ఎప్పుడూ ఎవరినైనా ఏదో ఒకటి అంటూ, ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సోషల్ మీడియా అండదొరకడంతో ఎదురు లేకుండా పోయింది. తాజాగా మమ్ముట్టిని రామ్ గోపాల్ టార్గెట్ చేశాడు. నిన్ననే మణిరత్నం 'ఓకే బంగారం' చూశాను. అవార్డు కమిటీ మెంబర్స్ కి ఏదేని సెన్స్ ఉంటే మమ్ముట్టి అవార్డులన్నీ అతని కొడుకు దుల్కర్ కి ఇచ్చేయాలి. దుల్కర్ తో పోల్చి చూస్తే నటన పరంగా మమ్ముట్టి జూనియర్ అని, దుల్కర్ నుండి నటనను నేర్చుకోవాలని, దుల్కర్ కేరళ రాష్ట్రానికే వన్నె తెస్తాడు. మమ్ముట్టి సాధించలేనిది అతని కొడుకు సాధిస్తాడు అంటూ ట్వీట్ చేశాడు. మరి దీనికి ఎవరూ ఏమీ స్పందించలేదు..