అబ్బా... మన హీరోలంతా రిచ్ కిడ్ లే గురూ!

July 21, 2015 | 11:23 AM | 5 Views
ప్రింట్ కామెంట్
mahesh_NTR_alluarjun_rich_kids_niharonline

తెలుగు సినిమా ప్రారంభ దశకంలో గనక పరిశీలిస్తే... హీరో ఓ పేద కుటుంబానికి చెందిన వాడై ఉంటాడు. అలాగే హీరోయిన్ ఓ రాజకుమారి అయి ఉంటుంది. ఎలాగోలా కష్టపడి విలువిద్య, కత్తిసాములో ఆరితేరిన హీరో తన టాలెంట్ తో హీరోయిన్ ను పటాయించి సినిమా ఆఖర్లో ఆమె రాజ్యానికి రాజై పోతాడు. 70, 80 దశకాల్లో కూడా ఇదే ఫార్ములా కంటిన్యూ అవుతూ వస్తోంది. ఏ మెకానిక్ షెడ్డో, లేక చిన్న చితకా జీతగానిగా పనిచేసే హీరో ఎలాగోలా కష్టపడి కాస్త ఊరట కలిగే స్టేజికి చేరుకుని, జబ్బుతో బాధపడే తన తల్లిని బాగుచేయించుకోవటంతోపాటు, చెల్లిని ఓ గొప్పింటి వాడికిచ్చి పెళ్లి చేసి తాను ఓ ఇంటివాడై కథ సుఖాంతం చేస్తాడు. ఇక 90 తర్వాత ట్రెండ్ పూర్తిగా మార్చి పారేశారు. జనాలకు మరీ బోర్ కొట్టిందేమోనని హీరోయిజాన్ని కాస్త స్పీడప్ చేసి పారేశారు. ఓ ఆర్నెల్లోనో, లేదా ఏడాదిలోనో కోట్ల ఆస్తి సంపాదించి పాడేస్తాడు హీరో. ఎంత స్పీడ్ గా అంటే ఓ పాట అయిపోయే లోగా... చూసే వారికి ఇదీ మరీను అనిపించినా... హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యాలంటే ఆ మాత్రం ఉండాలిగా... ఇక ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ పూర్తి విరుద్ధం. ఏ మాత్రం కష్టపడకుండానే హీరోలు కోటీశ్వరులు అయిపోతున్నారు.  తండ్రి కోటీశ్వరుడు కావటంతో ఏ మాత్రం కష్టాలు తెలియని హీరో అనూహ్యంగా రోడ్లమీదకు రావటమో లేక హీరోయిన్ జ్నాన బోధతో మారిపోయి పేదవాళ్లకు సాయం చెయ్యటమో ఇలా సాగుతోంది. పవన్ అత్తారింటికి దారేది, బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి, మహేష్ అప్ కమింగ్ మూవీ శ్రీమంతుడు, ఎన్టీఆర్ సుకుమార్ రాబోయే చిత్రంలో ఇలా అన్నింటిలో హీరోలు మల్టీ మిలినియర్ వారసులుగానే కనిపిస్తున్నారు. అప్పట్లో కూడా ఇలాంటి ఫార్ములాతో వచ్చిన చిత్రాలు ఉన్నప్పటికీ అవి చాలా అరుదు. హీరోలను కష్టపెట్టి ఫ్యాన్స్ మనస్సును మరీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో మన దర్శకులు. ఇప్పుడీ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ