ఇటీవలే తనను కలవాలని కోరుకున్న కేన్సర్ పేషెంట్ శ్రీనిధిని కలిసి మాట్లాడి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆ అభిమాని ఎన్టీఆర్ పుట్టినరోజునే చనిపోవడం ఆయనను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ చాలా బాధ పడ్డారు.. శ్రీనిధి గతకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఈ చిన్నారి జీవించి ఉన్నప్పుడే తన కోరిక తీర్చి ఆనందంతో ముంచాలనే ఉద్దేశంతో... తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ను ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చిన్నారిని కలిపే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి శ్రీనిధిని కలిసి పరామర్శించాడు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. కానీ ఆ చిన్నారి మంగళవారం అర్థరాత్రి చనిపోయింది. శ్రీనిధి భౌతికకాయాన్ని స్వస్థలమైన వరంగల్ జిల్లా బంధనపల్లి గ్రామానికి తరలించారు. ఆమె మరణవార్త తెలిసిన ఎన్టీఆర్ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.