రాంచరణ్‌తేజ్ కు గోవిందుడు అందరివాడేలే సినిమా తరువాత నాలుగు నెలలు గ్యాప్ వచ్చింది. కొత్తగా ఈయన శ్రీను వైట్ల సినిమాలో నటిస్తున్నట్టు త్వరలో షూటింగ్ జరుపుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా జనవరి చివరి వారం లో షూటింగ్ జరుపుకోబోతోందట. మధ్యలో గ్యాప్ వస్తే నేమీ ఆయన ఖాతాలో మరో సినిమా చేరిపోయిందని ఫిల్మ్ నగర్ టాక్. శ్రీనువైట్ల సినిమా తరువాత ఛెర్రీ సురేందర్‌రెడ్డి డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఛెర్రీ బావ బన్నీతో సురేందర్‌రెడ్డి తెరకెక్కించిన రేసుగుర్రం రూ.58 కోట్లు వసూలు చేసి ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. సురేందర్‌రెడ్డి ప్రస్తుతం రవితేజతో కిక్-2 సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఈ లోగా వచ్చే జూన్ నాటికి శ్రీనువైట్ల-ఛెర్రీ సినిమా కూడా పూర్తవుతుంది. ఇక ఈ సంవత్సరం ద్వితియార్థం నుంచి ఛెర్రీ-సురేందర్‌రెడ్డి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. టాలీవుడ్‌లోని ఓ టాప్ ప్రొడ్యుసర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.