మాధురీ దేశాయ్ అనే ముంబాయి భామ యూ ట్యూబ్ లో ఓ విడియో విడుదల చేసింది. ఇది తనను రేప్ చేయండి అంటూ పబ్లిక్ గా పిలుస్తున్నట్టు ఉండే ఒక వ్యంగపు వీడియో... ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అత్యాచార, హత్య నేరాలను ఉద్దేశించి ఒక సందేశాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుందీ వీడియో. సమాజంలో చిన్న పాప నుంచి ముసలి వాళ్ళ వరకూ స్త్రీలకు రక్షణ కరువైందనీ, ఈ అన్యాయాన్ని ఈ విధంగా సెటైరిక్ గా చెపుతున్నప్పటికీ, దీన్ని కొందరు సీరియస్ గా తీసుకుని ఇదేం విడ్డూరమంటూ విమర్శిస్తున్నారు కూడా. మూడు వారాల క్రితం విడుదలైన ఈ వీడియో గురించి ప్రశ్నించే వారు ఉన్నట్టే విమర్శించే వాళ్ళూ ఉన్నారు. ఇది రెచ్చగొట్టే విధంగా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను దాదాపు మూడు లక్షలమందికి పైగా చూసి తోచిన విధంగా కామెంట్లు పోస్టు చేశారు. ఈమె ఉద్దేశం ‘అత్యాచారాలు నేరం’ అనే మెసేజ్ తో కూడి ఉన్నప్పటికీ, లోతుగా అర్థం చేసుకోలేని వారికి ఇది రెచ్చగొట్టే లాగానే కనిపిస్తుందంటున్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టాలంటే మార్గం మరో రకంగా చూపితే బాగుంటుంది గానీ, ఇలా మాత్రం కాదని అంటున్నారు మేధావి వర్గం. కనిపిస్తున్న అమ్మాయి మాధురీ దేశాయ్ అయితే, ఈ వీడియో ఆలోచనకు, ఆవిష్కరణకు మూల కారకుడు మనీష్‌గుప్తా.