రాజీవ్ సాలూర్ కథానాయకుడిగా నటించిన సినిమా ఓరి దేవుడోయ్. శ్రీరామ్ వేగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఛేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్.వి. నిర్మించారు. మదిరాక్షి, మోనికా హీరోయిన్లు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ``సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. యువతలో సృజన మెండుగా ఉందనీ, వారు అనుకుంటే ఏ స్థాయికి అయినా చేరుకోగలరని చెప్పే సినిమా ఇది. కోటిగారు స్వరపరచిన పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మంచి కథ, కథనాలతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది`` అని అన్నారు. మంచి సంపాదనా పరుడైన ఓ యువకుడు తన సమస్యలతో పాటు చుట్టూ ఉన్న వారి సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు తెలిపారు.