బ్యాంకు లోన్లు నెలలోగా చెల్లిస్తానంటున్న నిర్మాత...

May 07, 2015 | 02:19 PM | 90 Views
ప్రింట్ కామెంట్
oscor_ravichandran_niharonline

అగ్ర నిర్మాతగా అగ్ర కథానాయకులతో భారీ బడ్జెట్ తో ఆస్కార్ రవిచంద్రన్ ఇటీవల రూపొందించిన చిత్రం ‘ఐ’. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈ చిత్రం కోసం ఆయన చేసిన అప్పులు కారణంగా ఇండియన్ ఓవర్ సీస్ అధికారులు ఇటీవల ఆయన ఆస్థులను జప్తు చేశారు. అయితే ఈ బ్యాంక్ లోన్స్ ను తాను ఒక నెలలోనే తీర్చేస్తానని తన ఆస్థులను విడిపించుకుంటానని అంటున్నారు. అలాగే ఐ చిత్రం మొత్తం మీద 150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే విశ్వరూపం 2 సినిమా సిజీ వర్క్ జరుగుతుందని పూర్తయిన తర్వాతే విడుదల గురించి తెలియజేస్తానని కూడా చెప్పుకొచ్చారట. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ