ఇటీవలే బాలీవుడ్ సినిమాల్లోకి ఎంటరైన పరిణీతి చోప్రా అప్పుడే ఓ ఇంటిదైపోయిందండీ... అంటే పెళ్ళిచేసుకోలేదు. బాంబేలోని ఓ కాస్ట్ లీ ఏరియాగా చెప్పుకుంటున్న బాంద్రా ఏరియాలోని సముద్రపు ఒడ్డున ఓ ఫ్లాట్ కోనేసుకుంది. అది కూడా ప్రీతిజింతా పక్క ఫ్లాటే నట. దీన్ని చూడగానే పడిపోవాల్సిందే నట. అంత బాగుంటుందనేగా అర్థం. బాంద్రాలో ఇల్లంటే ఆషామాషీ కాదటండీ... చాలా గొప్పగానూ, సంతోషంగా ఉందంటోంది పరిణీతి చోప్రా. చాలా తక్కువ సమయంలో ఇంత డబ్బు సంపాదించిందంటే, ఆమె రేంజ్ ఏ లెవల్లో ఉందో ఊహించుకోవచ్చు. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకోవడమే కాదు, ఒక మంచి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొంది సియరామ్స్ కంపెనీకి ఆమె పనిచేస్తోంది. ఇకనేం ఆమెకు సినిమాలతో పాటు, మంచి వ్యాపార సంస్థ కూడా దొరికింది... ఇక బాంద్రాలో ఫ్లాట్ కొనడం చాలా వీజీనే కదా..!