నందమూరి వంశానికి ఈ ఏడాది తొలి హిట్టు పటాస్ తో వచ్చింది. కల్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళంలో జీవా చేయనున్నట్టు సమాచారం. జీవా తండ్రి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి ఈ సినిమాకు సంబంధించిన తమిళ హక్కులను కొనుగోలు చేశారట. రూ.65 లక్షలకు తమిళ హక్కులను కల్యాణ్ రామ్ ఇచ్చినట్టు సమాచారం. పటాస్ త్వరలో తమిళంలో రీమేక్ కానుంది. కరెప్టడ్ పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. మరో వైపు తండ్రీ తనయుల అనుబంధాన్ని కూడా ఆవిష్కరించారు