హిట్లకి, ఫట్లకి పవన్ ఒకేలా స్పందిస్తాడట

January 24, 2015 | 02:56 PM | 118 Views
ప్రింట్ కామెంట్

ప్రతి హీరో కెరీర్ లో ఒక ఫ్లాప్ సినిమా ఉన్నట్టే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనూ ‘జానీ’ ఫ్లాప్ సినిమాగా ముద్రపడిపోయింది. అది కూడా పవన్ స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఫ్లాప్ తరువాత పవన్ ఎంతో మనోవేదనకు గురయ్యారట. డిస్ట్రిబ్యూటర్ల నుంచి, బయ్యర్ల నుంచి ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. జయాపజయాల్ని ఎప్పుడూ పట్టించుకోననీ, రెండింటికీ అతీతంగా ఉండాలని ప్రయత్నిస్తుంటానని కూడా చెప్పుకున్నాడు. కానీ జానీ సినిమా చేసిన తరువాత కొందరి చూపులు ఆయనను ఎంతలా ఇబ్బంది పెట్టింది గుర్తు చేసుకున్నారు. తనను ఓ క్రిమినల్ లా చూసేవారన్నారు. హిట్టయితే అందలం ఎక్కిస్తారనీ అదే ఫ్లాయితే తిడతారని అన్నారు. ఆ సినిమా చాలా పాఠాలు నేర్పిందని కూడా చెప్పుకున్నారు. ఎంతైనా ఆకాశం లాంటోడు లేండీ... హిట్లోచ్చినా, ఫట్లోచ్చిన ఒకేలా స్పందిస్తాడీ పవర్ స్టార్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ