రాయ్ లక్ష్మి పంపుకు బ్రేక్

October 06, 2015 | 02:09 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ray-laxmi-sardar-sets-with-pet-niharonline

లక్ష్మి రాయ్ కు పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చిన నాటి నుంచి భూమ్మీద కాళ్ళు నిలబడడం లేదు. మొన్నెప్పుడూ తమిళ్ స్టార్ అజిత్ నూ, పవన్ కళ్యాణ్ ను కలిపి తెగ పొగిడేసింది. అమ్మడు ట్విట్టర్లో ఏదో ఒకటి పోస్టు చేస్తూ హడావుడి చేసేస్తోంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తున్న రాయ్ లక్ష్మి ఇటీవల పవన్ కళ్యాణ్‌ సెట్స్‌ లో దిగిన ఫోటోలను పోస్టు చేసి పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేయడంతో ఆయన ఫ్యాన్స్ దృష్టంతా రాయ్ లక్ష్మి వైపు మళ్లింది. దీంతో ట్విట్టర్లో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ ఆనందం ఆమెకు ఎంతో సేపు నిలవలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో ఆమెకు చిన్న కుక్క పిల్ల దొరికింది. అది ఎంతో క్యూట్ గా, ముద్దుగా ఉండటంతో దాన్ని చేరదీసింది. దానికి ‘గబ్బర్' అనే పేరు పెట్టింది. పోయి పోయి కుక్క పిల్లకు తమ హీరో సినిమా టైటిల్ పెట్టడంతో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీంతో మళ్ళీ విమర్శల జోరు పెరిగింది. తమ అభిమాన హీరోను కించపరచినట్టుగా ఫాన్స్ ఫీలై... తిట్ల దండకం మొదలు పెట్టారట పాపం. లక్ష్మీ రాయ్ సీన్ సీతారయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ