పవన్ కళ్యాన్ తన లెక్క-తిక్క చూపేందుకు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 29 న ప్రారంభించనున్నారు. ఎప్పుడూ ఓ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో హీరోలను చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో సీరియస్ ప్లస్ కామెడీ జోడించిన డిఫెరెంట్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించారు. దీంతో ఈ సినిమాను మళ్ళీ తెరమీదకు తేవాలనే తీవ్ర ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. మూడు సంవత్సరాల తర్వాత కథ ఓ దారిలో పడి సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో అలియాస్ జానకి ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఒక హీరోయిన్ అయితే ఇంకొక హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర ఈ చిత్రం పగ్గాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, ఈరోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.