రాంచరణ్-శ్రీనువైట్ల సినిమా బ్రూస్ లీ కోసం మొదటి నుంచీ చాలా కసరత్తులే చేస్తున్నారు. ఇది మగధీర లెవల్ లో బ్లాక్ బస్టర్ చేయాలన్న కసితో రాంచరణ్ న్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఇప్పటికే ఐటమ్ సాంగ్ లో ఇలియానాను దింపడం, చిరుతో స్టెప్పులేయించడం... చేసేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ బాగున్నాయనే టాక్ కూడా వచ్చింది. ఇవి చాలవన్నట్టు పవర్ స్టార్ ను కూడా ఈ సినిమాలో ఇన్ వాల్వ్ చేసి మరిన్ని మార్కులు కొట్టేయాలని రాంచరణ్ చూస్తున్నాడు. ఆ తాజా వార్త ఏమిటంటే... పవన్ కల్యాణ్ వాయిస్ తో క్రేజ్ తేనున్నాడట. ఆ విషయమే బాబయ్ తో చెర్రీ అనడంతో... ఆయన ఓకే చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే గ్యాంగ్ లీడర్లో చిరంజీవి రోల్ మాదిరిగా వుంటుందంటూ రైటర్ గోపీమోహన్ క్లూ ఇచ్చేశాడు. ఈ సినిమా ఆడియో ఈనెల చివరలో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.