రెమ్యునరేషన్లో అదీ పవన్ లెక్క

January 22, 2015 | 12:02 PM | 1011 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ అగ్రహీరోలు ఎవరు ఎంత పారితోషకం తీసుంటారనే దానిపై ఎక్కడా క్లారిటీ కనిపించదు. ఏ హీరో ఫ్యాన్స్ ఎవరికి వారికి వారే ఎంత పడితే అంత ఊహించుకొని ఓ... తెగ ప్రచారం చేస్తుంటారులేండి. అయితే ఈ విషయంలో పవర్ స్టార్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఇచ్చేస్తున్నాడు. పవన్ వెంకీల గోపాల గోపాల సంక్రాంతికి విడుదలై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గానూ ఇటు పవన్ గానీ, అటు వెంకీ గానీ ముందుగా పైసా రెమ్యునరేషన్ తీసుకోలేదట. వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటామని ముందే నిర్మాతలతో చెప్పారట. దీనిప్రకారం పవన్-శరత్ మరార్, వెంకీ-సురేష్ బాబు లు వచ్చే లాభాల్లో వాటా పంచుకోవాలని డిసైడ్ అయ్యి ఒప్పందం చేసుకున్నారు. తాజాగా ఇఫ్పటి వరకు ఈ చిత్రం 40 కోట్లకుపైగానే సాధించింది. ఈ లెక్కన దాదాపు రూ.20 కోట్లు పవన్ శరత్ కు చేరతాయి. ఇందులో పవన్ వాటా 75 శాతం అంటే దాదాపు రూ.15 కోట్లు అన్నమాట. హిందీ రీమేక్ కావటంతో సురేష్ బాబు ఇలా తెలివిగా ఆలోచించి వేసిన ఫ్లాన్ ఇదీ అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. మొత్తానికి ఈ చిత్రం ద్వారా పారితోషకం విషయంలో కొత్త విధానానికి నిర్మాతలు, హీరోలు తెరలేపారు. ఏదేమైనా తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పవన్ కి ఓ లెక్క ఉందని మాత్రం క్టియర్ గా తెలుస్తోంది కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ