కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ పూర్తయిన తరువాత ప్రస్తుతం ‘దృశ్యం’ (పాపనాశం)తమిళ రీమేక్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే త్వరలో మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారట ఈ హీరో. అమీర్ ఖాన్ ‘పీకే’ను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీయడానికి సిద్ధమవుతున్నారు. జెమినీ ప్రొడక్షన్స్ సంస్థ దీని రీ మేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు భాషల్లోనూ కమల్ హాసన్ హీరోగా నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. త్వరలో మరిన్ని వివరాలను అధికారికంగా వెలువడనున్నట్టు తెలుస్తోంది.