మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కళ్లు చూసి పూజా హెగ్డే ఫ్లాటయిపోయ్యిందట. అంతేకాదు వరుణ్ చాలా అందగాడు అని తన కోస్టార్ ని తెగ పొగిడేస్తోంది ఈ బికినీ భామ. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ముకుంద చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు ఈ భామ చెప్పేసింది. వరుణ్ తేజ్ చూపు చురకత్తులా ఉంటుందట. తానే ఆ చూపుకు ఏ అమ్మాయి అయినా అతగాడికి పడిపోవాల్సిందేనంటోంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోహీరోయిన్లకు అసలు పేర్లే ఉండవన్న విషయాన్ని చెప్పేసింది. అంతేకాదు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు శేఖర్ కమ్ముల గెస్ట్ రోల్ లో నటించారని చెప్పింది. అమ్మాయిలు వరుణ్ తేజ్ కి పడిపోవడం మాట అటుంచి గోపికమ్మ సాంగ్ ట్రైలర్ చూసిన కుర్రాళ్లంతా పూజా అందానికి మాత్రం ఫిదా అయిపోతున్నారు.