డార్లింగ్... పెళ్లి ముచ్చట అంతేనా?

July 09, 2015 | 05:53 PM | 9 Views
ప్రింట్ కామెంట్
baahubali_hero_prabhas_on_his_marriage_niharonline

ఓ సినిమా కోసం ఏ హీరో చెయ్యని త్యాగం. మూడేళ్లపాటు బయటి ప్రపంచంతో సంబంధాలను తెంచెసుకున్నాడు. తన పెళ్లి విషయాన్నే వాయిదా వేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలిని ఓ యజ్నం లా భావించాడు. విమర్శలను, పుకార్లను లైట్ తీసుకున్నాడు. దెబ్బలను బోనస్ గా భావించి కష్టపడ్డాడు. ఎట్టకేలకు చిత్రాన్ని పూర్తిచేశాడు. బాక్సాఫీస్ పై దాడికి సిద్ధమైపోయాడు. అంతా సవ్యంగా అయ్యింది కదా... మరి పెళ్లి మాటేంటని ప్రభాస్ ను ప్రశ్నిస్తే... ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఈ మధ్య ఓ భీమవరం సంబంధం వచ్చిందటగా అని ప్రశ్నిస్తే... అలాంటిదేం లేదని కొట్టిపాడేశాడు. బాహుబలి విడుదలయ్యాక కొన్నిరోజలు విశ్రాంతి తీసుకుంటానని, ఆ తర్వాత రెండో భాగం షూటింగ్ లో పాల్గొంటానని చెబుతున్నాడు. అదీ పూర్తి కావడానికి మరో ఏడాది పట్టోచ్చు... లేదా అంతకన్నా ఎక్కువే కావచ్చో... ఇలా ఏళ్లకు ఏళ్లు సినిమాతో గడిపేస్తే మరి పెళ్లి ముచ్చట ఎప్పుడని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఎక్కువ రోజులు ఉండటం కూడా అంత మంచిది కాదేమో డార్లింగ్...జర ఆలోచించు...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ