ఇది శ్రీమంతుడు తెచ్చిన మార్పేనా...?

September 08, 2015 | 04:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
prakasharaj_kondapalli_niharonline

ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి కానీ, సినిమా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఏదో సమాజానికి మేలు జరిగింది అన్న వార్తలు వినడం బహు తక్కువ. కానీ ఇలా శ్రీమంతులు పూనుకుంటే మాత్రం సమాజానికి చాలా మేలు చేయొచ్చు. చాలా మంది హీరోలు సినిమాలో... పెద్ద మెసేజ్ లే ఇచ్చేస్తున్నారు గానీ, పాటించడంలో మాత్రం సున్నా... సినిమాలు చాలవన్నట్టు రాజకీయాల్లోకి వచ్చి చేసింది కూడా శూన్యమే. కానీ శ్రీమంతుడు ఇచ్చిన ఇన్సిపిరేషన్ చాలానే ఉందనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు రెండూర్లు, విష్ణు పది ఊర్లు, శృతిహాసన్ కూడా ఊరు దత్తత తీసుకుంటానని ఎనౌన్స్ చేసింది. ఇంత వరకు మెచ్చుకోవచ్చు. కానీ అన్న మాట నిలబెట్టుకుని ఏదైనా ఆ ఊరికి చేస్తే మరికొంత మందికి స్ఫూర్తి ఇచ్చిన వారవుతారు. 
కొత్తగా ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ లో ఓ ఊరిని దత్తత తీసుకున్నాడు... ఆయన కూడా కేవలం మాటలకే పరిమితం చేయకుండా అప్పటి కప్పుడు ఆ ఊరికి వెళ్ళి పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు. “నేను రాజకీయాల్లోకి రావడానికో .. మరో స్వార్ధానికో గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదు. గ్రామాల అభివృద్ది ప్రజల హక్కు. భవిష్యత్ లో కొండారెడ్డి పల్లి గ్రామ ప్రజలు ఇతర గ్రామాలను దత్తత తీసుకునే స్థాయికి ఎదగాలని” ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ను కలిసి ప్రతిపాదించిన ప్రకాష్ రాజ్ ఈ రోజు గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ప్రకాష్ రాజ్ కు ఈ ఊరి పక్కనే ఫాం హౌస్ ఉంది. అక్కడ ఆయన భూమి సాగు చేస్తూ వివిధ రకాల కూరగాయలు కూడా పండిస్తున్నారు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఇతర రాష్ట్రాలకు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు కొండారెడ్డి పల్లి వాసులను కలిసి గ్రామంలోని సమస్యలు, పనుల మీద ఆయన చర్చించారు.
తనతో పాటు కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్ గ్రామంలో మొక్కలు నాటారు.  కొండారెడ్డిపల్లి అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడతానని,  ఎలాంటి అభద్రతాభావం లేకుండా గ్రామాభివృద్ధికి అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ