జర్నలిస్ట్ పై నోరు పారేసుకున్న నటి

March 05, 2015 | 11:13 AM | 27 Views
ప్రింట్ కామెంట్
preity_zinta_slams_journalist_over_niharonline

వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం ఎవరికైనా కరెక్ట్ కాదు. అలాచేస్తే ఎవరికైనా మండుతుంది. కానీ, తమ వ్రుత్తిలో భాగంగా జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి. లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. అంతేకానీ హద్దు దాటి ప్రవర్తించకూడదు. అలాంటి ఘటనే ప్రస్తుతం బాలీవుడ్ లో చోటుచేసుకుంది. హీరోయిన్ ప్రీతిజింటా ఓ జర్నలిస్ట్ పై మండిపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పర్సనల్ లైఫ్ గురించి అడిగిన ప్రశ్నకు ప్రీతిజింటా నుండి ఉహించని రెస్పాన్స్ రావడంతో ఖంగు తినడం జర్నలిస్ట్ వంతైంది. బెస్ట్ జర్నలిస్ట్ అని కాకుండా ఓ మహిళగా ఉండి చూడు అని అందట. అంతేకాదు చివర్లో ఇలా వ్యక్తిగత విషయాల గురించి అడిగి విమర్శలకు గురికావొద్దంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ బాయ్ ఫ్రెండ్ నెస్ వాడియాతో గొడవ పడిన తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్ తో ఆమె డేటింగ్ చేస్తుందన్న విషయాన్ని ప్రీతిని అడగటంతో ఆమె తన నొటికి పని చెప్పిందని సమాచారం. నెస్ వాడియాకి దూరం కావడం దురదృష్టకరమన్న ప్రీతి, తన కెరీర్ ను పణంగా పెట్టి ఐపిఎల్ టీం పంజాబ్ ఎలెవన్ ను నడిపిస్తున్నానని తనపై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయటం తగదని ఆమె అంటోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ