మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళు... అంటూ మగాళ్ళను హేట్ చేస్తూ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే ప్రియమణి కనుమరుగై పోయిందేంటబ్బా అనుకుంటున్న సమయంలో ఆమెకు ఓ సినిమా ఛాన్స్ వచ్చిందండీ...కాక పోతే తెలుగులో కాదట. తమిళ ప్రముఖ దర్శకుడు రామ్, తానే హీరోగా చేస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అయితేఇందులో తమిళ దర్శకుడు, రైటరూ అయిన మిస్కిన్ కథను సమకూర్చుతూ, సినిమాలో విలన్ వేషం కూడా వేస్తున్నాడట. మిస్కిన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన జీ ఆర్ ఆదిత్య దీనికి దర్శకత్వం వహిస్తాడట. రైటర్లూ, దర్శకులూ హీరో, విలన్లు అయితే అసిస్టెంట్ దర్శకుడా? సినిమా స్టార్టింగ్ లోనే బోలెడు ట్విస్టింగుల్లా ఉంది కదూ... సినిమాలోనూ ట్విస్టింగులుంటాయో?