జులైలో అమెరికాలో ‘శ్రీకారం’

June 05, 2015 | 05:42 PM | 0 Views
ప్రింట్ కామెంట్
raj_emandi_producer_srikaram_niharonline

యాక్‌మే యానిమేషన్స్‌ బ్యానర్‌పై, గత 25 సంవత్సరాలుగా యుఎస్‌ఎ లో ఇండస్ట్రీయలిస్ట్‌ గా, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌మ్యాన్‌గా దూసుకుపోతున్న రాజ్‌ ఈమండి నిర్మాతగా, నంది అవార్డ్‌ గ్రహీత పి. రవికుమార్‌ దర్శకత్వంలో జూలై నుండి ‘శ్రీకారం’ అనే చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ ఈమండి మాట్లాడుతూ..‘రీసెంట్‌గా ‘మిజిన్‌’ అనే పాప్‌ సింగర్‌ని పరిచయం చేస్తూ..మేము రూపొందించిన ఆడియో అండ్‌ వీడియో ఆల్బమ్‌ మంచి సక్సెస్‌ని సాధించి మార్కెట్‌లో రికార్డ్‌ సేల్స్‌ని సాధించింది. తాజాగా మా నుండి రాబోతున్న ఈ ‘శ్రీకారం’ చిత్రం కూడా ప్రేక్షకుల్ని అందర్నీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాము. ఈ మూవీ గురించి చెప్పాలంటే..భారతీయ సాంప్రదాయ విలువల గొప్పతనం గురించి తెలిపే మంచి కథతో ‘శ్రీకారం’ తెరకెక్కనుంది. ఇది స్వచ్ఛమైన, సాంప్రదాయమైన ప్రేమకథ. ఇండియా, అమెరికాల మధ్య జరుగుతున్న పెళ్ళిళ్లు, ఆ పెళ్ళిళ్ళ తర్వాత పుట్టే వారి జీవిత విధానాల గురించి తెలిపే చక్కని మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రమిది. నంది అవార్డ్‌ గ్రహీత పి. రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా లైవ్‌ సౌండ్‌ రికార్డింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిఫ్ట్‌ వర్క్‌ పూర్తయింది. జూలై నుండి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. 90 పర్సెంట్‌ మూవీ అమెరికాలోనే తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి అతి త్వరలో తెలియజేస్తాము..’ అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ-నిర్మాత: రాజ్‌ ఈమండి
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పి. రవికుమార్‌.

 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ