అనివార్య కారణాల వల్ల పూరి, నితిన్ చిత్రం ఆగిపోయింది. అయితే, దర్శకుడు పూరి మాత్రం తన తదుపరి చిత్రం ఎవరితోనో ప్రకటించేశాడు. మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ తో పూరి తదుపరి చిత్రం తీయబోతున్నాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా ఛార్మికౌర్ సమర్పణలో పూరి దర్శకత్వంలోనే జ్యోతిలక్ష్మీ చిత్రానికి సహా నిర్మాతగా కళ్యాణ్ వ్యవహారించటం విశేషం. ఇక వరుణ్ తేజ్ చిత్రం గురించి సి.కె.ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘చంద్రకళ నుంచి జ్యోతిలక్ష్మీ వరకు మా బేనర్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మా బేనర్లో వరుణ్ తేజ్ హీరోగా, పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పూరిగారు ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ని చేశారు. ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే ప్రారంభిస్తున్నాం. వరుణ్‌తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందే ఈ సినిమా మా బేనర్లో ఓ ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.