సినిమా నచ్చలేదంటే డబ్బు వాపస్ ఇస్తాడట...

June 19, 2015 | 03:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Lagadapati_Sridhar_about_kki_niharonline

ఈ రోజు (జూన్ 19)విడుదలైన సుధీర్ బాబు -నందితల ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా గురించి ఓ ఛాలెంజ్ చేస్తున్నాడు నిర్మాత లగడపాటి శ్రీధర్. తన సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇస్తాడట. ఆయన నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ రిలీజ్ కావడమే కాక విమర్శకుల నుంచి పాజిటివ్ స్పందన తెచ్చుకుంది. ప్రేమ కథా చిత్రంతో హిట్ పెయిర్ గా పేరుపొంది ఈ జంట మళ్ళీ ఒక హిట్ కొట్టినట్టే అంటున్నారు ప్రేక్షకులు.  అయితే నిర్మాత శ్రీధర్ చిత్రం గురించి మాట్లాడుతూ ’కన్నడంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని ,అలాగే ఈ చిత్రాన్ని ఓ వందమందికి చూపించానని అందరికీ సినిమా బాగా నచ్చిందని అందుకే ఈ సవాల్ చేస్తున్నానని’ అంటున్నాడు. ఆయన నమ్మకం వమ్ము కానట్టే కనిపిస్తుంది. ఈ సినిమా చూసి విశ్లేషణలు రాసిన వారంతా దీనికి 3 స్టార్స్ ఇస్తున్నారంటే ఇందులో కొంత విషయం ఉన్నట్టే కదా...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ