హీరోయిన్ల తీరుపై నిర్మాత ఫైర్

March 30, 2015 | 12:44 PM | 73 Views
ప్రింట్ కామెంట్
prasad_v_potluri_serios_sruthi_niharonline

ఇటీవల కాలంలో ఒక సినిమాకు ఒప్పుకుని, ఆ తరువాత డ్రాప్ అవడం సర్వసాధారణమై పోతోంది. ఈ ప్రభావం నిర్మాతలపై విపరీతంగా పడుతోంది. మిగతా వారికి ఒప్పుకున్న డేట్స్ అడ్జెస్ట్ మెంట్లు తదితర కారణాల వల్ల సినిమాకు జాప్యంతో పాటు డబ్బు వ్రుధా అవుతుందంటూ నిర్మాతలు వాపోతున్నారు. ఈ మధ్య సమంత కూడా ఓ సినిమా విషయంలో ఇదే పద్ధతిని అనుసరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రముఖ నిర్మాత, సినీ ఫైనాన్షియర్ ప్రసాద్ వి పొట్లూరి కూడా మండి పడుతున్నారు. నాగార్జున, కార్తీ సినిమాకు శృతి హాసన్ ఉన్నట్టుండి తప్పుకోవడం, తమ కాంట్రాక్టును రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆయన చాలా షాక్ కు గురయ్యారు. ఇప్పటి హీరోయిన్లు కాంట్రాక్టు' పేపర్లను టాయిలెట్ పేపర్లలా ఉపయోగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయన సహనం కోల్పోయి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమె స్థానం స్థానంలో తమన్నాను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. వీరిద్దరివీ ఇంతకు ముందు రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. శృతి ఈ విధంగా చేయడం వల్ల  తమ సంస్థ చాలా నష్టపోయిందని పీవీపీ వారు కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు పూర్తయ్యేవరకు శృతి హాసన్ను వేరే సినిమాకు అంగీకరించకూడదని కోర్టు ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ