రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ కిందా మీదా పడుతూ చివరికి పూర్తి చేశారు. ఇప్పుడు ఫలితం కూడా దక్కింది. ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. గుణ శేఖర్ పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలాగే కనిపిస్తోంది. అయితే రుద్రమదేవి చిత్రానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు చిత్రాన్ని నిర్మిస్తానని ఒక సందర్భంలో గుణ శేఖర్ కూడా అన్నాడు. ఇప్పుడు మాత్రం అగ్ర నిర్మాత దిల్ రాజు చాలా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు ఈ సినిమా మీద. గుణ శేఖర్ ఓకే అంటే తానీ సినిమా తీయడానికి సిద్ధమంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రతాపరుద్రుడు గా ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ విషయానికి వస్తే దిల్ రాజు కు ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడు దానికి తోడూ ఎన్టీఆర్ ని వెండితెరకు బాలరామాయణం తో పరిచయం చేసింది గుణ కావడం విశేషం . ఆ సినిమా తర్వాత గుణశేఖర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కుదరలేదు పైగా గోనగన్నారెడ్డి గా ఎన్టీఆర్ చేయాల్సి ఉంది కానీ అది కూడా కుదరలేదు అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఎన్టీఆర్ ప్రతాపరుద్రుడు గా చేసే అవకాశాలున్నాయని. ఈ సినిమా విషయంలో గుణశేఖర్, దిల్ రాజ్ సీరియస్ డెషిషన్ తీసుకుంటే... ఎక్కువ అవకాశాలు ఎన్టీఆర్ కే కనిపిస్తున్నాయి.