డి.కె.రవి టైటిల్ కోసం నిర్మాతల పరుగులు

March 20, 2015 | 03:19 PM | 47 Views
ప్రింట్ కామెంట్
DK_Ravi_niharonline

సినీ పరిశ్రమ అంటేనే డబ్బు మయం. ఇంతలా డబ్బుకు ప్రాధాన్యత నిచ్చే ఈ పరిశ్రమ హార్ట్ టచింగ్ సీన్లు కూడా హత్తుకునేలా తీస్తుంటారు. కథల కోసం, టైటిళ్ళ కోసం సినీ పరిశ్రమ కష్టాలు పడుతున్న దశలో ఓ రియల్ హీరో స్టోరీని తెరకెక్కించడమంటే జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది కదా. కన్నడ చిత్ర పరిశ్రమ నిర్మాతలు ఇప్పుడు ఐఎఎస్ అధికారి డికె రవి పేరుతో టైటిళ్ళ కోసం యుద్ధ ప్రారంభమైంది. సోమవారం (16 మార్చి) అనుమానస్పద స్థితిలో డి.కె.రవి మృతి చెందాడు. ఈ సంఘటన ఆధారంగా సినిమా తీసి క్యాష్ చేసుకుందామనుకున్నారు పెద్ద నిర్మాతలు. అందుకోసం ఆయన పేరుతోనే డీకే రవి అనే టైటిల్ గానీ, డిప్యూటి కమీషనర్ రవి అని రిజిష్టర్ చేసుకుందామని ఫిల్మ్ ఛాంబర్ కు పరుగులెత్తారట. మృతికి సంబంధించిన వ్యవహారంపై స్పష్టమైన వార్తలేమీ తెలియకపోయినా, ఆయన పేరుతో ఏ స్టోరీ చేసినా హిట్టే అని వారి అభిప్రాయం కాబోలు. ఆయన మృతి హత్యా, ఆత్మహత్యా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వాణిజ్య పన్నుల ఉన్నతాధికారిగా గత రెండు మాసాల వ్యవధిలో పన్ను ఎగ్గొడుతున్న స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు, కార్పొరేట్‌ సంస్థలు, వజ్రాలు, స్వర్ణాభరణాల వ్యాపారులపై రవి దాడుల్ని సాగించారు. ఈ మేరకు మూడు నాలుగు వందల కోట్ల పన్ను వసూలు చేశారు. ఆయన చేసిన దాడుల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారు కక్ష సాధింపులకు దిగి ఉండవచ్చేమోనని అనుమానిస్తున్నారు. ధోరణిని మార్చుకోక పోతే అంతం తప్పదని రవిని ఫోన్ ద్వారా బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఆయన నిజాయితీ పరుడైన ఐఎఎస్ అధికారి కావడమే కాదు, ఆయన పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి కావడంతో ఈయన కథను సినిమాగా తీయాలనే ఆలోచన చాలా మంది సినిమా ప్రొడ్యూసర్లలో కలగడం సహజం. ఈ నేపథ్యంలోనే టైటిల్ కు పోటీ పడడం జరుగుతోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ