కన్నడ నటి పూజా గాంధీ కోసం బెంగులూరు పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈమె పరారీలో ఉన్నట్టు చెపుతున్నారు. ఆమె ఇంటికి తాళం వేసి ఉండటం, పైగా ఈమె ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో పూజ ఎక్కడ ఉన్నదనేది అంతు చిక్కడం లేదు. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఇంతకూ ఆమె చేసిన నేరమేమిటంటే... బెంగుళూరులోని జయానగర్ ప్రాంతంలో ఈమె చాలా స్పీడ్ గా డ్రైవింగ్ చేసి వర్ష (50)అనే మహిళను తన కారుతో ఢీ కొట్టింది. ఆ మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి, ఇక కనిపించకుండా పోయింది. పూజా యాక్సిడెంట్ చేసిన సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమెతోనే ఉన్నారట. ప్రస్తుతం వర్ష పరిస్థితి విషయంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. వర్ష కుటుంబ సభ్యులు పూజా గాంధీపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతుకులాడ్డం మొదలు పెట్టారు.