ఛార్మితో పూరి ఎఫైర్ అందు కోసమేనంట!

February 05, 2015 | 12:10 PM | 44 Views
ప్రింట్ కామెంట్

సినీ పరిశ్రమలో పనిచేసేవారికి లింకులు అంటగట్టడంలో మన తెలుగు మీడియాకు సాటి రానిది ఇంకేది లేదంటున్నాడు స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్. నటి ఛార్మీతో పూరికీ గత కొంతకాలంగా సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశాడు. ‘‘ఛార్మితో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. మీడియాలో మా గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయి. తాను త్వరలో తీయబోయే జ్యోతి లక్ష్మి చిత్రంలో ఛార్మియే లీడ్ రోల్. అందుకే ఆమెను తరుచు కలుస్తున్నాను. సినీ పరిశ్రమలో పనిచేసేవారు దర్శకుడు అనేవాడు ఒక నటడితో గానీ, ఒక నటితోగానీ ‘టచ్’ లో ఉంటేనే సెట్స్ మీద మా పని సులువవుతుంది. కథ, పాత్ర, ఇలా వేటి గురించైనా వారితో చర్చించేందుకే తరుచు కలుస్తుంటాం. అంత మాత్రానా సంబంధాలు అంటగడతారా’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఛార్మితో కూడా జ్యోతిలక్ష్మి చిత్రం కోసమే కలుస్తున్నారట తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అంటున్నాడు జగన్. మీడియా ఇలాంటి నిరాధారమైన వార్తలు రాయటం మానుకోవాలని చెబుతున్నాడు. సినిమా కోసం అయితే ఈ అర్థరాత్రి మీటింగ్ లేంటి చెప్మా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ