తన తనయుడి నటనను చూసిన తర్వాత ఆగలేకపోతున్నానని అంటున్నారు పూరి జగన్నాథ్. పూరి తనయుడు పూరి ఆకాష్ హీరోగా నటించిన తొలి సినిమా ఆంధ్రాపోరి. ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాను ఒక రోజు ఆలస్యంగా చూశారట పూరి. ఆ సినిమా గురించి మాట్లాడుతూ ``నేను ఒక రోజు ఆలస్యంగా సినిమా చూశాను. ఆకాష్ చాలా మంచి ఈజ్ తో నటించాడు. తనతో ఇంకో రెండు, మూడేళ్ల తర్వాత సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ ఈ సినిమా చూశాక వెంటనే సినిమా చేయాలనిపిస్తోంది. సీతాకోకచిలక సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన టీనేజ్ లవ్ స్టోరీ ఇదే`` అని అన్నారు పూరి. ఎంతైనా పూరి ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉన్నారు మరి.