సాయి రామ్ (వాడు నేను) కాదు రామ్ శంకర్

June 05, 2015 | 11:45 AM | 0 Views
ప్రింట్ కామెంట్
Vadu_Kadu_Nenu_movie_start_and_sairam_name_change_in_to_ramshankar_niharonline

ఒక స్టార్ హీరోకు తమ్ముడు...  మొదటి సినిమా అన్నయ్య దర్శకత్వంలోనే చేశాడు. ఆ తరువాత సినిమా అవకాశాలు బాగానే అందిపుచ్చుకున్నాడు... కానీ ఈ హీరో అంతగా క్లిక్ కాలేక పోయాడు. 143 అనే చిత్రంతో సినీ తెరంగేట్రం చేశాడు పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలే  చేశాడు. ఏవీ కలిసి రాలేదు. దీంతో సెంటిమెంట్ గా భావించాడేమో పేరు మార్చుకున్నాడిప్పుడు. హీరో సాయి రామ్ శంకర్ని, రామ్ శంకర్ గా పిలవాలి.... రాయాలి.... ఇలాంటి సెంటిమెంట్లు తెలుగు సినిమావాళ్ళకు బాగా ఉంటాయి. ఒక సినిమా మూడక్షరాలతో సక్సెస్ అయిందంటే ఆ తరువాత కూడా అలా మూడక్షరాలతోనే పేర్లు పెట్టాలని చూస్తారు. ఓ హీరోయిన్ తో సక్సెస్ వస్తే అదే హీరోయిన్ ని మరో సినిమాకు బుక్ చేసుకుంటారు. ఇలా కొబ్బరి కాయ కొట్టడం దగ్గరి నుంచి పేర్లు, హీరోలు, డైరెక్టర్లు.... వాళ్ళ న్యూమరాలజీ నెంబర్లు మీన మేషాలన్నిటినీ లెక్కేసుకుని మరీ సినిమాలు చేస్తుంటారు. ఇలా తన సుడి ఏమైనా తిరుగుతుందనుకున్నాడేమో సాయిరామ్ పేరు మార్చుకున్నాడు.  ఇప్పుడు ఈ హీరో ‘వాడు నేను కాదు’ పేరుతో గురువారం ఓ చిత్రాన్ని మొదటు పెట్టాడు. ఈ సందర్భంగా తాను పేరు మార్చుకున్న విషయాన్ని వెల్లడించాడు సాయిరామ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ