పూరీ జగన్నాథ్ సినిమాలనగానే అందులో బ్యాంకాక్ కనిపించి తీరుతుంది. పోనీలే బ్యాంకాక్ చూడలేని సామాన్య జనం పూరీ సినిమా చూసి తరిస్తారు. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమా అంతా గోవాలో షూటింగ్ చేస్తున్నారట. అవసరం ఉన్నా లేకపోయినా బాంకాక్ ప్రాయాణం కట్టే పూరీ సినిమా యూనిట్ ఇప్పుడు గోవాలో తిష్ట వేశారు. పూరీ-బాంకాక్ కు అవినాభావ సంబంధం ఉందనుకుంటున్న సినీ పరిశ్రమ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టి, టెంపర్ సినిమా కూడా గోవాలోనే షూటింగ్ చేసాడు. లొకేషన్స్ పరంగా ఎక్కువ ఖర్చు చేయకుండా క్వాలిటీ అవుట్పుట్ రాబట్టాడు. దీంతో ప్రస్తుతం గోవామీద అభిమానం పెరిగిపోయిందట పూరీ జగన్నాథ్ కు. అందుకే తన కొత్త సినిమా షూటింగ్ కూడా అక్కడే చేస్తున్నాడు. ఛార్మి ప్రధాన పాత్రలో జగన్ తెరకెక్కిస్తున్న 'జ్యోతిలక్ష్మి' చిత్రం షూటింగ్ ఇప్పుడు గోవాలో జరుగుతోంది. పూరి తీస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఈ చిత్రానికి నిర్మాతగా ఛార్మి వ్యవహరిస్తోంది. తక్కువ బడ్జెట్ తో సినిమా తీయాలని ముందే అనుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఖర్చు ఎక్కువ పెట్టగూడదనుకున్నారేమో... లేక బ్యాంకాక్ మొహం కొట్టేసిందేమో... పూరీ అడ్డా అక్కడినుంచి ఇక్కడికి మారిపోయింది.