ఈ మధ్య కాలంలో సినిమా వివాదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. బయ్యర్ల గోల, కథల గోల, కాల్షీట్ల గోల... ఇలా అనేకం.... ఇవి సినిమాల రిలీజ్ లకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. అయితే కొత్తగా పూరి జగన్నాథ్ వివాదం వినిపిస్తోంది. ఇప్పటిదాకా చిరంజీవి 150వ మూవీ స్టోరీ పై పెద్ద రభస జరిగింది. ఇప్పుడు తెరపైకి ‘జ్యోతిలక్ష్మి’ వచ్చేసింది. అదే... ఈ సినిమా కథకు సంబంధించిన అంశం. ‘మిసెస్ పరాంకుశం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారట. ఈ నవల రైటర్ ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. అయితే పూరీ దీన్ని చాలా వరకు మార్చుకున్నారట. ఈ స్టోరీ లైన్ తీసుకున్నందుకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే రైటర్ కు ముట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చాలా తక్కువ మొత్తం అని కూడా అనుకుంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘టెంపర్'కి కోటి వరకు పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. మరి జ్యోతి లక్ష్మికి ఇంత తక్కువా అని కూడా అనుకుంటున్నారు. ఈ సమస్యతో మళ్ళీ జ్యోతి లక్ష్మి విడుదల జాప్యం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫిల్మ్ నగర్ లో.. అంత పెద్ద దర్శకుడు ఈ సమస్యను సెటిల్ చేయలేరా? అని కూడా అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో...?