పూరీ కాస్త తేడా కొడుతుందే

December 08, 2015 | 05:11 PM | 2 Views
ప్రింట్ కామెంట్
puri-speech-at-Loafer_Audio_Launch_niharonline

హీరోయిజాన్ని చూపేందుకు తాను పేజీలు పేజీలు రాసుకుంటే. ఒక్క డైలాగుతో హీరో అంటే ఏంటో చెప్పటం ఒక్క పూరీకే సాధ్యమని దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసించాడట. ఈ విషయాన్ని ప్రభాస్ లోఫర్ ఆడియో వేడుకలో చెప్పాడు. హీరోలను మాస్ గా అనడం కంటే కాస్త మెంటల్ ఉన్నవాడిగా చూపటంలోనే పూరీ జగన్ దిట్ట అన్నది జగమెరిగిన విషయం. మూడు నెలల్లో సినిమాల చాపలా చుట్టేసి కోట్లకు కోట్లకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న పూరీ పై జక్కన్న ప్రశంస  కాస్త ఆశ్చర్యం కలిగించేదే. వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి వచ్చిన పూరీపై మొదట్లో అంచనాలు భారీగా ఉండేవి. మధ్యలో పోకిరి, దేశముదురు లాంటి హిట్లు పడటంతో స్టార్ దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. అయితే హిట్ల కన్నా ఫ్లాప్ శాతమే ఆయన సినిమాల్లో ఎక్కువ. ముఖ్యంగా ఆయన కథతో వచ్చిన చిత్రాలు దాదాపు పరాజయం పాలైనవే. 

                                ఇక ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన టెంపర్ కథారచయిత వక్కంతం వంశీ కావటం పూరీకి అడ్వాంటేజ్ అయ్యింది. మధ్యలో పెన్ను పట్టి తిరిగి జ్యోతిలక్ష్మి అంటూ ఛార్మితో చేసిన ప్రయోగం జనాలకు సుతరామూ నచ్చలేదు. ఇక ఇప్పుడు మెగా వారసుడు వరుణ్ తేజ్ తో లోఫర్ అనే ఓ మాస్ చిత్రాన్ని ప్రేక్షకుల మీదకు వదిలేందుకు సిద్ధమైపోతున్నాడు. మదర్ సెంటిమెంట్ హైలెట్ గా నిలవనున్న ఈ చిత్రం హిట్ కావటం గ్యారెంటీ అని చెప్పుకోస్తున్నాడు పూరీ. అక్కడే కాస్త తేడా కొట్టినట్లు అనిపిస్తోంది. గతంలో వచ్చిన ఏక్ నిరంజన్ మాదిరిగానే ఈచిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. దీనికి తోడు రేవతి కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లుగా అనిపిస్తోంది. ట్రైలర్ డైలాగులు బాగా పేలాయి అని చెప్పుకుంటున్నప్పటికీ స్క్రిప్ట్ లో కంటెంట్ లేనిదే ఏం జరిగినా వేస్టే కదా. వెరసి కంచెతో మంచి హిట్ అందుకున్న వరుణ్ తో లోఫర్ పేరుతో ఏం చేస్తాడో అని మెగా అభిమానుల్లో దిగులు పట్టుకుంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ