నచ్చలేదని మీడియా ద్వారా వినడం... ఆయనను హర్ట్ చేసినట్టుంది. ఏ దర్శకుడు స్టోరీ చెప్పినా... ఒకప్పుడైతే ఏమో గానీ ఇప్పుడున్న హీరోలకు మార్చమని చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ చిరంజీవి 150వ చిత్రం స్టోరీ పై ఇన్నాళ్ళుగా డైలమా కొనసాగుతూ వస్తుంది. అయితే ఆటో జానీ స్టోరీ సెకండాఫ్ నచ్చలేదని నేరుగా మీడియాకు చెప్పారట మెగాస్టార్. అది తనకే చెప్పి ఉంటే మార్చేవాడిని కదా అంటున్నాడు పూరీ జగన్నాథ్. ఒకవేళ అదే విషయం నాకు చెప్పుంటే కథలో ఏం నచ్చలేదో తెలుసుకొని మార్పులు చేసేవాణ్ని అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ జన్మదినం సందర్భంగా ఆయన ఆదివారం హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా చిరంజీవి 150వ సినిమా గురించి ప్రస్తావించగా... ఆయన ఇలా సమాధానమిచ్చారు. గతంలో... "నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు ," అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అయితే చాలా కాలం తరువాత సెకండాఫ్ నచ్చలేదని నేరుగా మీడియాతో అనడం పూరీగారి మనసు నొచ్చుకున్నట్టుంది. ఆ విషయం ఈ రోజు బయట పెట్టారు. అయితే చిరంజీవి 150 సినిమా విషయంలో ఇంకా ఇతర డైరెక్టర్లతో డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోగా చరణ్ బ్రూస్ లీ చిత్రంలో గెస్ట్ గా నటించడానికి సెట్స్ పైకి వెళుతున్నారు చిరంజీవి.