తండ్రులు తమ కుమారుడి మొదటి సినిమానే పెద్ద హిట్ ఇవ్వాలని ఆచీ తూచీ అరంగేట్రం చేయిస్తుంటే ఈ పెద్ద దర్శకుడు తన కుమారుడిని టీనేజైనా రాకముందే ఇంకొకరి చేతిలో పెట్టేశాడు. బాలనటుడుగా ఉన్నప్పుడే ఈ అబ్బాయి మొదటి సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ చేసేస్తాడేమో ఈ దర్శకుడు అనుకున్నారంతా. కానీ చిన్నపిల్లల లవ్ స్టోరీలాంటి ఓ సినిమాలో నటించేస్తున్నాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్. కన్నడలో హిట్టయిన టైమ్‌పాస్ అనే టీనేజ్ లవ్‌స్టోరీకి రీమేక్‌గా రూపొందుతోన్న 'ఆంధ్రాపోరి' చిత్రంతో ఆకాష్ హీరో అయ్యాడు((!). అప్పుడే ఏం తొందరొచ్చిందని పూరీ గారు ఈ సినిమాకు అంగీకరించారో మరి. తను నటుడిగా ఈ సినిమాను హిట్ చేస్తే, తండ్రి పెద్ద కమర్షియల్ సినిమా తీస్తాడని తన నటననంతా ఛాన్స్ వచ్చిన ఆంధ్రా పోరీలో చూపిస్తున్నట్టున్నాడు ఆకాష్.