ఈ ఏడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ రభస చిత్రం. యంగ్ టైగర్ సరసన సమంత, ప్రణీత ఆడిపాడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కథాకథనం పాత చిత్రాలతో పోలిక ఉండటం. ఎన్టీఆర్ నటన, సమంత అందాల ప్రదర్శన తప్ప ఇంట్రస్టింగ్ పాయింట్లు ఏం లేకపోవటంతో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే విడుదలకు ముందే రూ.8 కోట్ల రికార్డు స్థాయిలో టెలివిజన్ హక్కులకు అమ్ముడు పోయి ఈ చిత్రం అప్పుడు వార్తల్లోకెక్కింది. ఇప్పడు ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా చిత్రం ఈ నెల 7 న జెమినీ టీవీలో ప్రదర్శితం అయ్యింది. ఇక విషయానికోస్తే టీఆర్పీ రేటింగ్ లో ఈ చిత్రం నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు, జబర్దస్త్ రియాలిటీ షోలను తలదన్ని మరీ 14.5 రేటింగ్ తో అగ్రస్థానం పొందింది. ఇప్పటి వరకు నమోదైన టీఆర్పీలో ఇదే అత్యధికం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా బడా స్ర్కీన్ పై కలెక్షన్ లు రాబట్టలేక పోయిన బుడ్డోడి చిత్రం బుల్లితెరపై మాత్రం ఓ రికార్డును మాత్రం క్రియేట్ చేసి పడేసింది.