‘రక్తచరిత్ర’, ‘ధోని’, ‘లెజెండ్’ చిత్రాలు తర్వాత ప్రస్తుతం ‘లయన్’ సినిమా చేస్తున్న రాధికా అప్టేకి మాత్రం తెలుగు చిత్రసీమ గురించి మంచి అభిప్రాయం మాత్రం లేదు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యలో బయటపెట్టింది. తెలుగు చిత్రసీమలో మేల్ డామినేటింగ్ చాలా అధికమని, హీరోయిన్ గురించి అసలు పట్టించుకోరని చెప్పుకొచ్చింది. లండన్ కి డ్యాన్స్ మూమెంట్ ట్రైనింగ్ కి కూడా వెళ్లానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. మరి ఈ కామెంట్స్ పై టాలీవుడ్ ఏమంటుందో చూడాలి.