మళ్లీ చీర కట్టి చిందులేయనున్న లారెన్స్

March 04, 2015 | 10:36 AM | 66 Views
ప్రింట్ కామెంట్
Raghava_Lawrence_kanchana_2_niharonline

డాన్సర్ నుండి యాక్టర్, అటు నుండి దర్శకుడు గా మారిన రాఘవ లారెన్స్. కానీ రెబల్ సినిమాతో పడిన దెబ్బ లారెన్స్ కెరీర్ గ్రాఫ్ ను మసకబారేలా చేసింది. దీంతో తనకు హిట్లిచ్చిన సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఇదే క్రమంలో అతడి ఆరోగ్యం కూడా దారుణంగా దెబ్బతింది. కాగా, రీసెంట్ గా కోలుకోవటంతో తిరిగి ‘ముని’ సీక్వెల్ పై బిజీగా ఉన్నాడట. ‘ముని-3’ (గంగ) గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ను రీసెంట్ గా ‘కాంచన-2’ అని మార్చారు. ఈ సినిమాలో నాలుగు లేడీ గెటప్స్ లో లారెన్స్ కనిపించనున్నాడని ఫిలిం వర్గాల సమాచారం. గత చిత్రం ‘కాంచన’ చిత్రంలో మూడు డిఫరెంట్ గెటప్స్ అలరించిన లారెన్స్ ఈ సారి ఒక లేడీకి చెందిన నాలుగు స్టేజీల గెటప్స్ లో కనిపించనున్నాడట. 15 ఏళ్లు, 25 ఏళ్లు, 40 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో ఈ గెటప్ ఉంటుందట. ప్రస్తుతం సినిమా ఫైనల్ స్టేజ్ ఉందని, అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ