‘ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మనం’ వంటి బ్లాక్‌బస్టర్స్‌కు రచనా సహకారం అందించిన ‘ముకుంద్ పాండే’ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై యువ నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథాచిత్రం ‘ఎల్`7’. అదిత్ (‘కథ, తుంగభద్ర’ చిత్రాల ఫేమ్) పూజా రావేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు మల్కాపురం శివకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.యస్.రావు, ప్రముఖ రచయిత`నటుడు హర్షవర్ధన్ తదితరులు విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లు అదిత్`పూజ రaవేరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు దశరధ్ క్లాప్ కొట్టగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు కెమెరా స్విచ్చాన్ చేసారు. మరో ప్రముఖ దర్శకులు విజయ్‌కుమార్ కొండ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి, సహనిర్మాతలు మోహన్‌రావు.బి`సతీష్ కొట్టే`కె.పున్నయ్య చౌదరి, కెమెరామెన్ దుర్గాప్రసాద్, దర్శకుడు ముకుంద్ పాండే, హీరో అదిత్, హీరోయిన్ పూజా రaవేరి పాల్గొన్నారు. ముకుండ్ పాండే చెప్పిన స్టోరి విన్న వెంటనే సెకండ్ ధాట్ లేకుండా ఈ సినిమా తీయాలని ఫిక్సయిపోయామని నిర్మాత సుబ్బారెడ్డి తెలిపారు. ప్రేమలోని పలు దశలను ఆవిష్కరిస్తూ సాగే అందమైన ప్రేమకథగా ‘ఎల్`7’ను రూపొందించనున్నామని, ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్న నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు ముకుంద్ పాండే అన్నారు. ‘కథ, వీకెండ్ లవ్, తుంగభద్ర’ చిత్రాల తర్వాత తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తనను ‘ఎల్`7’ హీరోగా ఎంపిక చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని హీరో అదిత్ అన్నారు. ‘భమ్ బోలేనాధ్’ అనంతరం తను చేస్తున్న ‘ఎల్`7’ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉందని హీరోయిన్ పూజా పేర్కొనగా.. ‘ఈ వర్షం సాక్షిగా’ అనంతరం తన మిత్రుడు సుబ్బారెడ్డితో కలిసి ‘ఎల్`7’ చిత్రాన్ని నిర్మిస్తుండడం పట్ల సహనిర్మాత మోహన్‌రావు.బి సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఇతర ముఖ్య నటీనటుల ఎంపిక జరుపుకొంటూ.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి ఆర్ట్: నాగసాయి, కెమెరా: దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.కిషోర్, సహనిర్మాతలు: మోహన్‌రావు.బి`సతీష్ కొట్టే`కె.పున్నయ్య చౌదరి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్‌రెడ్డి, నిర్మాత: బి.ఓబుల్ సుబ్బారెడ్డి, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ముకుంద్ పాండే!!