‘ఉయ్యాల జంపాల’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘కుమారి 21F’చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రం కూడా ప్రారంభమైంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమా మార్చి 15న పూజా కార్యక్రమాలను ప్రారంభించుకుంది. తొలి సన్నివేశానికి విరించి వర్మ గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత తల్లిదండ్రలు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐపీయస్ అధికారి రావులపాటి సీతారామారావు క్లాప్ నిచ్చారు. బేబీగౌతమి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి గోపిసుందర్ మ్యూజిక్ అందించనున్నారు.