బాహుబలి... జక్కన ఒక్కడిదే కాదు దాదాపు కొన్ని వందల మంది రెండేళ్లుగా కష్టపడుతున్న ఓ యజ్ణం. సుమారు వంద కోట్ల పై బడ్జెట్ చిత్రమిది. అలాంటి చిత్ర ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉండాలో అతనికి బాగా తెలుసు. అందుకే మే 1నుంచి మొదలు పెట్టి పోస్టర్ లు రిలీజ్ చేస్తూ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అయితే సోషల్ మీడియా సైట్లో వస్తున్న కొన్ని విమర్శలకు కూడా సమాధానామిస్తూ ఈ రోజు రాజమౌళి క్లారిటీ ఇఛ్చేశాడు. ఇంకా మూడు పోస్టర్ లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ తర్వాత ఆడియో పంక్షన్లో ట్రైలరేనని చెప్పేశాడు. ట్విట్టర్లో ఈ రోజు అస్లాం ఖాన్ అకా సుదీప్ పోస్టర్ ను వెలువరించిన అనంతరం మరో విషయాన్ని కూడా చెప్పేశాడు. 18వ తేదీన తమన్నా ఆవంతిక పోస్టర్ ను, 20న రానా లుక్ బల్లాలదేవను, 22న అసలు పోస్టర్ బాహుబలిని రిలీజ్ చేస్తానని చెప్పేశాడు. ఇక జనాల్ని విసింగించటం ఇష్టం లేదనుకున్నాడో ఏమో ఇలా ఒకేసారి మొత్తం ముందే చెప్పేశాడు. అంతేకాదు 31న ఆడియోతోపాటు ట్రైలర్ ను విడుదల చేస్తామని తెలియజేశాడీ దర్శకధీరుడు .