టాలీవుడ్ ప్రేక్షకులే కాదు యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న తెలుగు చిత్రం బాహుబలి. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేద్దామనుకున్నారు. అయితే గ్రాఫికల్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో అది కాస్త పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని వేసవిలోనే విడుదల చేస్తారట. మొదటి భాగాన్ని మే 15న విడుదల చేయాలనుకుంటున్నట్లు, అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ వీడియోలో స్వయంగా రాజమౌళి తెలియజేశాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా బాహుబలి అనే టైటిల్‌తోనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఆయన అభిమానులకు బాహుబలి పెద్ద పండుగనే తీసుకొస్తుందనడంలో సందేహం లేదని ఫిలిమ్ నగర్ వర్గాలు అంటున్నాయి.