రాజమౌళి తన టీమ్‌కే కాదు, తాజాగా సెన్సార్ సభ్యులకు కూడా ఆంక్షలు పెట్టారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన బాహుబలి సెన్సార్ ఈ నెల 22న జరగనుంది. ఇటీవల పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కు, కిల్ కిల్ భాషకు, పాటలకు మంచి స్పందన వస్తోంది. చిత్ర యూనిట్ కూడా బాలీవుడ్ సభ్యుల తరహాలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా బాహుబలి గురించి రాజమౌళి సెన్సార్ సభ్యులకు ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. సినిమాను సెన్సార్ చేసే సభ్యులు తప్ప ఇతరుల్ని స్క్రీనింగ్ ప్రదేశానికి రానివ్వకూడదని ఆయన ఖరాఖండిగా చెప్పారని వినికిడి.