వింటున్నాడు. అయితే ఫిలింనగర్ వర్గాల్లో మాత్రం రజనీకాంత్ తన నెక్స్ ట్ మూవీని శంకర్ దర్శకత్వంలో చేస్తాడని, శంకర్ రజనీకాంత్ ఇమేజ్ కి తగిన విధంగా ఓ స్టోరిని తయారు చేశాడని, రజనీకాంత్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి నెంబర్ వన్ అనే టైటిల్ పెట్టారని కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు రజనీకాంత్, అటు శంకర్ క్యాంప్ నుండి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు రజనీకాంత్ లారెన్స్ దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని కూడా వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అధికారకంగా ఏదేని సమాచారం వస్తే తప్ప ఈ ఉహగానాలకు తెరపడదు మరి...