సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఆస్కార్ రవిచంద్రన్ ఓసినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఎ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఓ కొలిక్కి రాలేదు. కానీ అంతలోనే రజనీకాంత్ నిర్మాతకి ఓ చిన్న కండిషన్ పెట్టాడట. నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకోవాలని సూచించాడట. అందుకు కారణం 'లింగ' సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్‌తో జరిగిన గొడవే కారణమని కూడా అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.