మా అధ్యక్షుడు విలన్ గా మారుతున్నాడు

March 26, 2016 | 04:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
rajendra-prasad-ready-for-villian-roles-niharonline

తెలుగు తెరపై కామెడీని కదను తొక్కించిన కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ కి ఎంతో పేరుంది. యువతరం తెరపైకి రావడంతో ఆయన తన వయసుకి తగిన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలకమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ చాలా బిజీగా వున్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్, ఇకపై నెగెటివ్ రోల్స్ ను కూడా చేయడానికి సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది.

                   ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడు ఆయనని కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథలోని నెగెటివ్ రోల్ ఆయన చేస్తే కొత్తగా .. విభిన్నంగా ఉంటుందని చెప్పాడని అంటున్నారు. దాంతో రాజేంద్రప్రసాద్ కూడా ఆ పాత్రను చేయడానికి అంగీకారాన్ని తెలిపాడని చెబుతున్నారు. అంతేకాదు ఇకపై కూడా నెగెటివ్ రోల్స్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. విలక్షణమైన పాత్రలను పండించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే రాజేంద్రప్రసాద్ ను నెగెటివ్ రోల్స్ లో చూడబోతున్నామన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ