మొదటి సినిమా నుంచీ తూర్పుగోదావరి యాసలో డైలాగులు ఇరగదీస్తున్నాడు కుర్ర హీరో రాజ్ తరుణ్. కొందరు ఈ హీరోను జూనయిర్ రవి తేజగా పిలుచుకుంటున్నారు. ఉయ్యాల జంపాల హిట్ తో ఈ కుర్ర హీరో ఆఫర్లు బాగానే సంపాదించుకుంటున్నాడు. సినిమా చూపిస్త మావ కూడా హిట్ కొట్టడంతో అయ్యగారు పారితోషికం బాగా పెంచేశాడట. మొదటి సినిమాకు 6 లక్షలు, సినిమా చూపిస్తమావ కు 15 లక్షలు తీసుకున్నాడట. ఇక సుకుమార్ కుమారి 21 ఎఫ్ కు 35 లక్షలు డిమాండ్ చేశాడట. ఈ సినిమా ఇంకా పూర్తి కానే లేదు మరో సినిమాకు ఆఫర్ వచ్చింది. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాకు హీరోగారు కోటి రూపాయలు అడిగాడట. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ తో సినిమా చెయ్యాలంటే కోటి రూపాయలు పట్టుకుని వెళ్ళాలన్న మాట. లేదూ కుమారి 21 ఎఫ్ విడుదలై హిట్టయితే కోటి రూపాయల ఫిగర్ కూడా మారిపోతుందేమో మరి...