నటన రాకపోయినా ఫర్వాలేదు కేవలం గ్లామర్ తోనే నెట్టుకొచ్చే నటీమణులు తెలుగు భాషను ఏలుతున్నారన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తూ ఎక్స్ పోజింగ్ తో అదరగొడుతూ అందిన అవకాశాలను వాడుకోవటంలో వారిని మించిన వారు లేరు. దశాబ్దంపైగా ఇక్కడ పరభాషా నటీమణుల హవా కొనసాగుతుందన్నది అందరికీ తెలసిన విషయమే. అయితే ఈ మధ్య వచ్చే నటీమణులు మాత్రం కాస్త ఇంగితంతో వ్యవహారిస్తున్నారన్నది చెప్పొచ్చు. కానీ, కొందరు మాత్రం నేరుగా ఇక్కడ హీరోల డామినేషన్ ఉందని ఓపెన్ గా చెప్పి సంచలనం సృష్టించారు. కానీ, ఏదీ పడితే ఆ రోల్ చేసి ఆపై మంచి పాత్రలను కొట్టేయటంలో ఇప్పుడున్న హీరోయిన్లు చాలా తెలివిగా వ్యవహారిస్తున్నారు. తొలినాళ్లలో గ్లామర్ రోల్స్ చేసి రాను రాను నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఆటోమేటిక్ గా సంపాదించుకుంటున్నారు.
ఇక ఇలా తెలివిగా వ్యవహారిస్తున్న వారిలో రకుల్ ప్రీత్ ఒకరు. కెరీర్ లో ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. కానీ, చిన్నా చితకా హీరోలతో చేసింది. ఆపై కాస్త పేరు వచ్చాక ఇక వరుస పెట్టి స్టార్లతో క్యూ కడుతుంది. కానీ, ఇన్నాళ్లు ఊరిస్తూ వస్తున్న నటనను ఇప్పుడు బయటపెట్టింది. రాంచరణ్ బ్రూస్ లీ లో కూడా ఆమెది గ్లామర్ తోనే సరిపెట్టుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఓపెన్ శృంగారం రసాలను ఒలకబోస్తూనే మరోవైపు నటన కూడా చేస్తూ అలరించింది. ఇనాళ్లు ఆమెకు నటన రాదు అన్న వాళ్ల నోటితోనే రకుల్ ఏం చేసింది అని అనుకునేలా చేసింది. రకుల్ విశ్వరూపం ఇన్నాళ్లకు చూపించావా అని అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారట.