రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్. వరుస సక్సెస్ లతో ప్రస్తుతం అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. అయితే మధ్యలో వచ్చిన ఫ్లాపులు అమ్మడి గ్రాఫ్ ను దారుణంగా పడేశాయి. గతేడాది వచ్చిన పండగచేస్కో, బ్రూస్ లీలు డిజాస్టర్లుగా నిలవటంతో ఆఫర్లపై కాస్త నీలినీడలు నమ్ముకున్నాయి. అలాంటి టైంలో ఎన్టీఆర్ తో సినిమా ఈ ఢిల్లీ భామకు మళ్లీ గత వైభవం తెచ్చే అవకాశం కల్పించింది.
తాజాగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరుగుతోంది. గ్లామర్ పరంగానే కాదు నటనలో కూడా రకుల్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ కూడా ఆమెతో నటించాలని ఉబలాటపడుతున్నాడట. ఇప్పటికే 'అ... ఆ' సినిమాలో సమంతతో కలసి నటిస్తున్న ఈ యంగ్ హీరో, తన తదుపరి చిత్రంలో కథానాయిక పాత్ర కోసం రకుల్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె 'ఊ' అంటే ఎంత పారితోషికమైనా సరే ఇవ్వడానికి నితిన్ రెడీగా వున్నట్టు చెబుతున్నారు. మరి, రకుల్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇక ఇంకోవైపు బ్రహోత్సవంలో కూడా సమంత డేట్లు కుదరడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రకుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని మహేష్ నిర్మాతలకు సూచిస్తున్నాడంట. నిజానికి బ్రహోత్సవం ముందుగా రకుల్ కి వచ్చిందే. అయితే గతేడాది వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ ఆ ఛాన్స్ మిస్సయి సమంతకు వెళ్లింది. ఇప్పుడు సమంత కోలీవుడ్ లో బిజీ అయిపోవటంతో తిరిగి ఎంత పారితోషకం ఇచ్చైనా సరే రకుల్ నే తీసుకోవాలని నిర్మాతలు కూడా యోచిస్తున్నారంట. ప్రస్తుతానికైతే రకుల్ బన్నీ-బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉంది.