టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ, ‘ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా మెగా పవర్ స్టారే... అయితే ట్రూ జెట్' మొదటి విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. ఏటీఆర్ 72-500 విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగింది. రెండో విమానం మరో వారం రోజుల్లో చేరుకుంటుందని టర్బో మెఘా ఎయిర్‌వేస్ ఫౌండర్, మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. జూన్ చివరి వారంలో విమాన సర్వీసులు ప్రాంభించేందుకు సిద్ధం అవుతున్నామని ఆయన తెలిపారు. తొలుత తిరుపతి, ఔరంగాబాద్, రాజమండ్రిలకు సర్వీసులను నడిపించబోతున్నట్టు తెలిపారు.